మనోవేదన అధికంగా ఉంటుంది(రమణ.ఎం- హైదరాబాద్)
రమణ.ఎం- హైదరాబాద్: మీరు పాడ్యమి శుక్రవారం, వృశ్చిక లగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల రాజ్య లేక ఉద్యోగాధిపతి అయిన రవి, బుధ, చంద్రుల కలయిక వల్ల మనఃకారకుడైన చంద్రుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ మీకు సంతృప్తి, అభివృద్ధి ఉండజాలదు. ఆశించినంత గుర్తింపు రాలేదే అనే మనోవేదన అధికంగా ఉంటుంది. 2006 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2022 వరకు కొంత యోగాన్ని ఇస్తాడు. ప్రతిరోజూ సూర్యస్తుతి చేయడం వల్ల అశాంతి, ఆందోళన తొలగిపోతాయి. ఏదైనా దేవాలయాలలో కానీ, ఉద్యానవనాల్లో కానీ అరటి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.