గురువారం, 5 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 జనవరి 2026 (16:25 IST)

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

Sankranti
మకర సంక్రాంతి జనవరి 15న గొప్ప పండుగ రాబోతుంది, ఈ రోజు శుభప్రదంగా చేసే కొన్ని పనులు గురించి తెలుసుకుందాము.
 
మకర సంక్రాంతికి ముందు భోగి మంటలు వేసి, చిన్నారులపై భోగిపళ్లు పోస్తారు.
 
మరుసటి రోజు మకర సంక్రాంతికి కొత్తగా వచ్చిన ధాన్యంతో బెల్లం పొంగలి చేసి భగవంతుని నైవేద్యంగా పెడతారు.
 
ఆ మరుసటి రోజున గాలిపటాలను ఎగురవేస్తూ దానిని వేడుకగా జరుపుకుంటారు.
 
కనుమ రోజున గోవులను అలంకరించి వాటికి కడుపారా పచ్చి మేత తినిపించడం గొప్ప పుణ్యంగా భావిస్తారు.
 
మకర సంక్రాంతి సూర్యుని ఉత్తరాయణ పండుగ, కాబట్టి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు.
 
ఈ రోజున శ్రీ హరి విష్ణువు, మాతా లక్ష్మిని పూజిస్తారు.
 
తీర్థయాత్ర లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.