శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (19:02 IST)

29-09-2024 నుంచి 05-10-2024 వరకు మీ వార రాశి ఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు పనులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధ్యాయులకు ఏకాగ్ర, సమయపాలన ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. రుణ సమస్యలు వేధిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో కాలక్షేపం చేయటం శ్రేయస్కరం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నోటీసులు అందుకుంటారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుకుంటారు. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహ నెలకొంటుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీదైన రంగంలో రాణిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానానికి శుభయోగం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకోగల్గుతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కుటుంబీకుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. గురువారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులను సంప్రదిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. శుక్ర, శనివారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగుల కృషి ఫలిస్తుంది. నిరుద్యోగులు రాతపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆహ్వానం అందుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచలు చికాకుపరుస్తాయి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. సామరస్యంగా మెలగండి. పంతాలకు పోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆర్థికాభివృద్ధి. సాఫ్ట్వేర్ విద్యార్థులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మంగళవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్సిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. నూతన పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. లక్ష్యం నెరవేరుతుంది. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభయోగం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించండి. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు రూపొందించుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అర్థికలావాదేవీలతో సతమతమవుతారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మిత్రులుగా ఉన్న వారే వ్యతిరేకులవుతారు. బుధవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళ కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. జాతక పొంతనను పట్టించుకోవద్దు. కలిసివచ్చి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. వాస్తుదోష నివారణ అనివార్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత సంఘటనలు మరిచిపోవద్దు. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. సంతానానికి ఉద్యోగయోగం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్ర వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.