శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By kowsalya
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (11:43 IST)

కలబందతో చెడు కొలెస్ట్రాల్ మటాష్..

కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన 22 యాసిడ్స్ కలబందలో వున్నాయి. ఇవి ఎసిడిటీ, సైనస్, సొరియాసిస్, ఎగ్జిమా వంటి రుగ్మతలను నయం చేస్తాయి. లివర్ సమస్యలు, గౌట్, ఎముకల నొప్పులు, జుట్టు

కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన 22 యాసిడ్స్ కలబందలో వున్నాయి. ఇవి ఎసిడిటీ, సైనస్, సొరియాసిస్, ఎగ్జిమా వంటి రుగ్మతలను నయం చేస్తాయి. లివర్ సమస్యలు, గౌట్, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, స్త్రీల రుతు సమస్యలు, రక్తహీనత, అధిక బరువు వంటి సమస్యలను కూడా కలబంద నయం చేస్తుంది. 
 
కలబంద గుజ్జును రోజు ఓ స్పూన్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. శరీరంలోని టాక్సిన్లను ఇది తొలగిస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియాలను, వైరస్‌లను కలబంద నశింపజేస్తుంది. కలబందలో ప్రధానంగా 20 రకాల లవణాలు ఉంటాయని వాటిలో ముఖ్యంగా క్యాలియ్షం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలేనియం, సోడియం, మాంగనీసు, కాపర్, క్రోమియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. 
 
ఔషధ గుణాలవంటి ఎ, బి, సి, డి, ఇ, బి-12 వంటి అత్యంత కీలకమైన విటమిన్లు కలబందలో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో నుంచి లభించే లిపాసెన్ అనే ఎంజైము శరీరంలోని కొవ్వును చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కలబందలోని పోషకాలు కడుపులోని మంటను అరికట్టడంతోపాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.