మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:45 IST)

పచ్చకర్పూరంతో వీర్యవృద్ధి.. లైంగిక సామర్థ్యం పెరుగుతుందట..

పచ్చకర్పూరం మగవారిలో వీర్యవృద్ధిని పెంచుతుందట. తద్వారా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు కర్పూరాన్ని ఔషధంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చకర్పూరం మగవారిలో వీర్యవృద్ధిని పెంచుతుందట. తద్వారా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు కర్పూరాన్ని ఔషధంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి మూడు పది గ్రాములు చొప్పున తీసుకుని పొడి చేసుకోవాలి. 
 
ఇందులో ఎండుద్రాక్షల పొడిని కూడా కలిపి.. చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. వీటిని రోజూ నిద్రించేందుకు ముందు నోటిలో వేసుకుని మింగేస్తే వీర్య వృద్ధితో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చుండ్రు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెలో కర్పూరపు బిళ్ళల్లి వేసి.. గంట తర్వాత ఆ నూనెను రాసుకుని పావు గంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.  
 
అలాగే పచ్చ కర్పూరం స్వీట్లలోనే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న క్రిములన్నీ నశిస్తాయి. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు దరిచేరవు. 
 
వర్షాకాలంలో ఈగల సమస్యను దూరం చేసుకోవాలంటే.. ఓ అర బకెట్ నీటిలో గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి మరిగించి.. ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. దంతాలను శుభ్రం చేసేటప్పుడు బ్రష్‌పై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. క్రిములు నశిస్తాయి.