శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:50 IST)

బరువు తగ్గాలంటే.. కొత్తిమీర జ్యూస్ తాగండి.. తయారీ విధానం..

తొందరగా బరువు తగ్గాలంటే... బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు.కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. నేడు చాలా మంది వ్యాయామలేమి వల్ల , ఎక్సర్ సైజులు చేసే సమయం లేకపోవడం, వృత్తి

తొందరగా బరువు తగ్గాలంటే... బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు.కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. నేడు చాలా మంది వ్యాయామలేమి వల్ల , ఎక్సర్ సైజులు చేసే సమయం లేకపోవడం, వృత్తి పరమైన కారణాలు లేదా వంశపారంపర్యమైన కారణాల వల్ల అతి చిన్న వయసులోనే విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లలో ఒబిసిటీ సమస్య పెరిగిపోతోంది. 
 
ప్రస్తుతం అందరినీ వేధించే అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. అయినా ఫలితం లేకపోతే బాధపడతారు. కానీ ఇక బాధపడాల్సిన అక్కర్లేదు. ఈ జ్యూస్ తాగినే వారం రోజుల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చు. 
 
ఇంతకీ అదేం జ్యూసో.. అదెలా తయారు చేయాలో చూద్దాం.. ముందుగా కొత్తిమీరను ఒక మిక్సిలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్‌లా చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపాలి. అంతే బరువు తగ్గించే జ్యూస్ రెడీ అయినట్లే. దీనిని పరగడుపున తీసుకుంటే.. పొట్టలోని కొవ్వు కరిగిపోతుంది. ఈ జ్యూస్ తీసుకుని జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే మాత్రం తప్పకుండా బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.