శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (11:36 IST)

చలికాలంలో హెర్బల్ టీ సేవిస్తే ఎంతో మేలో తెలుసా?

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మనం రిఫ్రెష్ కోసం టీ, కాఫీలు తాగడం అలవాటు. అయితే హెర్బల్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
ముఖ్యంగా చలికాలంలో వేడి హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా ఈ హెర్బల్ టీ జలుబు, దగ్గుతో పోరాడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. అల్లం, పసుపు, దాల్చిన చెక్క పొడిని కలిపి టీ సిప్ చేయడం వల్ల జలుబు తగ్గుతుందని, శ్వాసక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే జీర్ణం కాని ఆహారం తిన్నప్పుడు హెర్బల్ టీ తాగడం మంచిదని, పుదీనా, సోంపుతో అల్లం టీని సిప్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద  నిపుణులు సూచిస్తున్నారు.