లావెండర్‌తో ప్రయోజనాలంటే తెలుసుకోండి!
లావెండర్ మొక్క ఆకులు సన్నగా పొడవుగా ఉండి, సిల్వర్ గ్రే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పాలు పింక్-పర్పుల్ వర్ణంలో ఉంటాయి. ఆకులలో కంటే పుష్పాలతో ఎక్కువ సుగంధ తైలాలుంటాయి. లావెండర్ సువాసన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రశాంతతను అందిస్తుంది.
ప్రయోజనాలేంటో చూద్దాం..
* లావెండర్ యాంటీసెప్టిక్‌దా, యాంటీ మైక్రోబియల్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. టైఫాయిడ్, డిఫ్తీరియాలాంటి వ్యాధులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
* మానసిక ఒత్తిడులను అధిగమించుటలో ఉపయోగకారిగా ఉంటుంది.
* తొలనొప్పితో బాధపడుతున్న వారు ఈ తైలాన్ని కణతలకు రాసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది.
* శరీర వాపుల్ని, నొప్పుల్ని నివారిస్తుంది.
* నరాలను ఉత్తేజపరుస్తుంది.
* కాస్మొటిక్స్, సెంట్లు, సోపులు, హెయిర్ వాష్‌ల్లో లావెండర్ తైలాలను విరివిగా ఉపయోగిస్తారు.
* కళ్లుతిరగడం, స్పృహ కోల్పోవడాన్ని నిలువరించడంలో లావెండర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది.
* ఆహారపానీయాలు, హెర్బల్ టీ, కేక్స్, బిస్కట్ల తయారీలో రుచికి, వాసన కోసం ఉపయోగిస్తారు.
* సుగంధ ఔషధంగా, సీతాకోకచిలుకల అభివృద్ధికి దోహదపడుతూ జీవవైవిధ్య వృద్ధికి ఉపయోగపడుతోంది. గార్డెన్ అలంకరణ మొక్కగా కూడా ప్రాచుర్యం ఉంది.