శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (19:49 IST)

చామంతి టీ తాగితే...?

చాలామందికి టీ తాగే అలవాటుంది. ఉదయాన్నే నిద్రలేవగానే పళ్లు కూడా శుభ్రం చేసుకోకుండా టీ తాగుతుంటారు. ఇలా చేయడం వలన దంతాలు పలురకాల ఇన్‌ఫెక్షన్స్ ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త డిఫరెంటుగా టీ తయారుచేసి తీసుకుంటే.. మంచిదంటున్నారు వైద్యులు. మరి ఆ టీ ఏంటో ఓసారి చూద్దాం..
 
చామంతి టీ:
కావలసిన పదార్థాలు:
టీ పొడి - స్పూన్
చామంతి పూ రేకులు - 2 స్పూన్స్
నిమ్మరసం - కొద్దిగా
తేనె - తగినంత
 
ఎలా చేయాలంటే..
ముందుగా టీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత తాజా చామంతి రేకులను వేసి మరికాసేపు మరిగించి ఆపై వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయాన్నే ఈ టీ తీసుకుంటే.. ఉత్సాహంగా ఉంటారు. నీరసం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. శరీరంలోని చెడు వ్యర్థాలను బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. ముఖ్యమైన సూచన.. ఈ టీ తాగే ముందుగా పళ్లు శుభ్రం చేసుకోండి చాలు.