మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (13:08 IST)

బరువు తగ్గాలంటే.. ఈ మందును తీసుకోండి..

బరువు తగ్గేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ మందును ఇంట్లో తయారు చేసి తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు, వాము, జీలకర్రను తీసుకోవాలి. మెంతులు

బరువు తగ్గేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ మందును ఇంట్లో తయారు చేసి తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు, వాము, జీలకర్రను తీసుకోవాలి. మెంతులు 300 గ్రాములు, వాము వంద గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు తీసుకుని వేయించుకోవాలి. మిక్సీలో రుబ్బుకుని పౌడర్లా వచ్చాక సీసాలో భద్రపరుచుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోజనానికి తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా 50 రోజుల పాటు తాగితే.. ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. ఈ మిశ్రమం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను రక్తం నుంచి తొలగిస్తుంది. 
 
శరీరం యవ్వనంగా, ముడతలు లేకుండా కనిపిస్తుంది. కీళ్ళనొప్పులు మాయమై.. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.