గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (20:17 IST)

PAK Vs NZ: పాకిస్తాన్ టార్గెట్ 238, న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ నీషామ్ 97 నాటౌట్

ప్రపంచ కప్ క్రికెట్‌ టోర్నీలో బుధవారం పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ పాకిస్తాన్‌ ముందు 238 పరుగులు విజయ లక్ష్యం ఉంచింది. న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది.
జేమ్స్ నీషాం 97, మిచెల్ శాంట్నర్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
 
పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదికి 3, మహమ్మద్ అమీర్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. పాక్ పేసర్ల ధాటికి న్యూజీలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టుకు నీషామ్, గ్రాండ్‌హోమె కీలక భాగస్వామ్యం అందించారు.
 
215 దగ్గర ఆరో వికెట్ డౌన్...
48వ ఓవర్లో కొలిన్ డీ గ్రాండ్‌హొమె(64) రనౌట్ అయ్యాడు.
47వ ఓవర్లో న్యూజీలాండ్ 200 పరుగుల మైలురాయిని చేరుకుంది.
హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న నీషామ్, గ్రాండ్‌హోమె 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టుకు కీలక భాగస్వామ్యం అందించారు.
 
జిమ్మీ నీషాం జోరు...
జిమ్మీ నీషామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
కొలిన్ డీ గ్రాండ్‌హోమెతో కలిసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు.
39వ ఓవర్లో న్యూజీలాండ్ 150 పరుగులు చేరింది.
32వ ఓవరులో 100 పరుగులు...
32వ ఓవర్లో న్యూజీలాండ్ 100 పరుగుల మార్కు దాటింది.
30 ఓవర్లు ముగిసేసరికి న్యూజీలాండ్ 5 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
జేమ్స్ నీషామ్, కలిన్ డీ గ్రాండ్‌హొమె క్రీజులో ఉన్నారు.
 
కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్...
27వ ఓవర్లో న్యూజీలాండ్ 5వ వికెట్ కోల్పోయింది.
న్యూజీలాండ్ స్కోర్ 83 పరుగుల దగ్గర కెప్టెన్ కేన్ విలియమ్సన్ పెవిలియన్ చేరాడు.
41 పరుగులు చేసిన విలియమ్సన్‌ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
20 ఓవర్లకు స్కోరు 64/4
న్యూజీలాండ్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆచితూచి ఆడుతున్నాడు.
 
కష్టాల్లో న్యూజీలాండ్...
పాక్ పేసర్ షహీన్ అఫ్రిది మరో వికెట్ పడగొట్టాడు.
46 పరుగుల దగ్గర కివీస్ టామ్ లాథమ్(1) వికెట్ కోల్పోయింది.
13వ ఓవర్ 3వ బంతికి లాథమ్ కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
50 పరుగుల లోపే 4 వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ కష్టాల్లో పడింది.
 
న్యూజీలాండ్ 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.
కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన రాస్ టేలర్...
38 పరుగులకు కివీస్ మూడో వికెట్ కోల్పోయింది.
షహీన్ అఫ్రిది మరో వికెట్ పడగొట్టాడు.
9వ ఓవర్ చివరి బంతికి రాస్ టేలర్‌ను అవుట్ చేశాడు.
3 పరుగులు చేసిన టేలర్ కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
కివీస్ మరో ఓపెనర్ అవుట్...
24 పరుగులు దగ్గర న్యూజీలాండ్ రెండో వికెట్ పడింది.
ఓపెనర్ కాలిన్ మున్రో 12 పరుగులు చేసి షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో క్యాచౌట్ అయ్యాడు.
 
అమీర్ తొలి బంతికే వికెట్...
పాక్ పేసర్ మహమ్మద్ అమిర్ తన తొలి ఓవర్లో తొలి బంతికే వికెట్ తీశాడు.
రెండో ఓవర్ వేసిన అమిర్ మొదటి బంతికే న్యూజీలాండ్ ఓపెనర్‌ను పెవిలియన్ పంపాడు.
5 పరుగులు చేసిన ఓపెనర్ మార్టిన్ గఫ్తిల్ మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇన్నింగ్స్ తొలి బంతిని గఫ్తిల్ బౌండరీకి పంపాడు.
 
టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్
టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది.
ఈ మ్యాచ్‌లో రెండు టీములూ ఇంతకు ముందు ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నాయి.
ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన న్యూజీలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 5 విజయాలతో 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
పాకిస్తాన్ కూడా 6 మ్యాచులే ఆడింది. రెండిటిలో గెలిచి 3 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 5 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది.