నెమలి ఎగరడం మీరు ఎక్కడైనా చూశారా.. వీడియో

Peacock,
మోహన్| Last Updated: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:25 IST)
నెమలి ఎగరడం మీరు ఎప్పుడైనా చూసారా? అది కూడా జంతు ప్రదర్శనశాలలో కాదండీ బాబూ.. జనాల మధ్యలో నుంచి మరీ చక్కర్లు కొడుతూ నెమలి ఎగురుతోంది. ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో ఓ నెమలి గాల్లో ఎగురుతోంది.

సాధారణంగా నెమళ్ళు జనాల మధ్య తిరగవు. అడవిలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ పురివిప్పి నాట్యం చేస్తుంటాయి. ఆ సమయంలో నెమలిని చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నెమలి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక నెమళ్ళు ఎగరడం కూడా చాలా అరుదు.

అయితే ఒకచోట నుండి మరోచోటుకి అవి ప్రయాణించాలంటే మాత్రం పక్షిలాగా ఎగురుతూ కనిపిస్తాయి. కానీ మనుషుల కంటపడవు అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న నెమలి మాత్రం అందంగా ఎగురుతూ చూసే వారికి కనువిందు చేసింది.

దీనిపై మరింత చదవండి :