మంగళవారం, 13 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:32 IST)

పండిన అరటిపండును పారేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇలా చేయండి

అరటి పండు బాగా పండిపోయింది. ఇక దాన్నేం తింటాం అని చెత్త కుండీలో వేసేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. పండిన అరటిపండుతోనే ఎన్నో లాభాలున్నాయంటే నమ్మి తీరాల్సిందే. పండిన అరటి పండు సౌందర్య సాధనంగా ఉపయో

అరటి పండు బాగా పండిపోయింది. ఇక దాన్నేం తింటాం అని చెత్త కుండీలో వేసేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. పండిన అరటిపండుతోనే ఎన్నో లాభాలున్నాయంటే నమ్మి తీరాల్సిందే. పండిన అరటి పండు సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే..? పండిన అరటి పండును, 3 చెంచాల నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకుని ఒక 15 నిముషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంలోని జిడ్డు పోతుంది. 
 
పండిన అరటి పండుకు ఒక చెంచా తేనె కలిపి, వచ్చిన మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మసాజ్ చేస్తే చర్మం‌పై ముడతలు పోతాయి. పండిన అరటి పండును వాడటం వల్ల నిర్జీవ కణాలు పోతాయి. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి.
 
సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండుని తీసుకోని పేస్ట్‌లా చేసుకోని జుట్టుకు రాయడం వల్ల చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది. పండిన అరటి పండును నేరుగా శరీరానికి అప్లై చేస్తే సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది.