బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (16:33 IST)

పాలలో పెసరపిండిని కలుపుకుని చర్మానికి రాసుకుంటే?

కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మ

కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా తీసుకుని పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకుని స్నానం చేసేటప్పుడు చర్మానికి రాసుకోవాలి.
 
ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్నానం చేసే ముందుగా నువ్వుల నూనెను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే పగిలిన చర్మం కాస్త మృదువుగా మారుతుంది. సబ్బుకు బదులుగా పాలలో పెసరపిండిని కలుపుకు చర్మానికి రాసుకుని స్నానం చేస్తే ఒంటికి మంచిది. 
 
స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ని లేదా బాడీ లోషన్‌ని చర్మానికి రాసుకోవాలి. రాత్రివేళ పడుకునే ముందుగా ముఖానికి కోల్డ్‌క్రీమ్, కాళ్లకీ, చేతులకీ పైట్ పెట్రోలియమ్ జెల్లీ తప్పకుండా రాసుకోవాలి. అప్పుడే చర్మం పగలకుండా కాంతివంతంగా ఉంటుంది.