శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:45 IST)

అరటిపండు గుజ్డులో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్

పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు, మచ్చులు తొలగిపోతాయి.
 
అరటిపండు గుజ్జు మృతు చర్మాన్ని తొలగిస్తుంది. పాలు నిగారింపునిస్తాయి. అరటిపండు గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. తద్వారా మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.