కుంకుమ పువ్వు, తేనెతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?
కుంకుమ పువ్వులో తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా పాలు, తేనె కలుపుకుని పేస్ట్‌ల
కుంకుమ పువ్వులో తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా పాలు, తేనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
అరటిపండు గుజ్జులో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గ్రీన్ ఆపిల్‌ను మెత్తగా రుబ్బుకుని అందులో నిమ్మరసం, కీరదోస మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది.