సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (14:41 IST)

గుడ్డు తెల్లసొనను జుట్టుకు రాసుకుంటే..?

గుడ్డు తెల్లసొనలో ముఖచర్మాన్ని అందంగా మార్చే గుణాలు అధిక మోతాదులో ఉన్నాయి. చర్మంలో దెబ్బతిన్న టిష్యూలను బాగు చేసి చర్మం బిగువుగా ఉండేలా తోడ్పడుతాయి. శిరోజాల పెరుగుదలకు సైతం సహకరిస్తాయి. తెల్లసొన చిట్కాలు కొన్ని...
 
కీర పేస్ట్‌లో తెల్లసొన వేసి మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమంగా చేస్తుంటే.. ముఖంచర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు చర్మంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
వయసు కనిపించకుండా ఉండడానికి ఒక గుడ్డు తెల్లసొనలో చక్కెర, పెరుగు వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవడమే రాకుండా మేనిఛాయ కూడా పెరుగుతుంది.
 
తెల్లసొనలోని పోషకాల వలన శిరోజాలు మెరవడంతోపాటు బాగా పెరుగుతాయి. దీనికి చేయాల్సిందేమిటంటే.. తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి మాడు బాగా మర్దనా చేసి అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.