శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:37 IST)

గుడ్డుసొనతో పెరుగు కలిపి.. ఫేస్‌ప్యాక్..?

గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా,

గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా, మృదువుగా మారుతుంది. కీరదోస రసంలో నిమ్మరసం, పసుపు, గ్లిజరిన్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. సూర్యకాంతి విత్తనాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
శెనగపిండిలో పసుపు, రోజ్ వాటర్, నిమ్మరసం, కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో టమోటా రసం, ఓట్స్ మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.