ద్రాక్ష పళ్ల రసాన్ని చర్మానికి పూతగా రాసుకుంటే...?
ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తప్పనిసరిగా ద్రాక్ష పళ్ల రసం క్రమం తప్పకుండా తాగుతుండండి. ద్రాక్ష పళ్ల రసాన్ని తాగడంతో మాత్రమే సరిపెట్టుకోక ద్రాక్ష పళ్లను చర్మానికి పూతగా కూడా తయారుచేసుకుని నిగారింపులు తీసుకురావచ్చు. అదెలాగో చూద్దాం.
ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌కు కొద్దిగా పౌడర్‌ను కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి. దానికి కీరదోస జ్యూస్ కాని, ద్రాక్ష రసం కాని కలుపుకుని చర్మానికి రాయండి. ఒక గంట తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ రాసుకుంటే మెరిసే నున్నని, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. కాబట్టి ద్రాక్ష పళ్లు చౌక అని తేలికగా కొట్టిపారేయకండి. అవి మీ మేను చర్మకాంతికి సొగసులద్దుతాయి.