శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (21:50 IST)

ముఖంపై మచ్చలు పోయేందుకు ఇలా చేస్తే...

ముఖ సౌందర్యం కోసం టీనేజ్ అమ్మాయిలు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా మొటిమలు పోయి మచ్చలు మిగిలిపోయినప్పుడు వాటిని తొలగించుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిని పోగొట్టేందుకు కొబ్బరిపాలలో, చెంచా గులాబీ నీళ్లూ, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. ఇలా రోజూ స్నానానికి ముందు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. మచ్చలూ తగ్గుతాయి. టేబుల్ స్పూన్ కొబ్బరి నీళ్లలో కాస్త పెసరపొడి కలపాలి. దీనికి చెంచా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి.
 
తరచూ మృతకణాల సమస్య తరచూ వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో అరచెంచా చొప్పున పాలమీగడా, తేనె, నిమ్మరసం టేబుల్ స్పూన్ సెనగపిండి కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని ఒంటికి నలుగులా రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది. కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని దానికి చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసినా ఫలితం ఉంటుంది.