సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:00 IST)

చామంతి పువ్వుల టీ, తేనె జతచేసి.. ముఖానికి ప్యాక్ వేసుకుంటే..?

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖాని

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖానికి మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
చామంతి పువ్వుల టీలో తేనె, ఓట్స్, బాదం నూనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. బియ్యపు పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. 
 
బ్రెడ్ ముక్కలను మెత్తగా రుబ్బుకుని అందులో మీగడ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. నారింజ తొక్కల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.