శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (15:29 IST)

తేనెలో పసుపు కలుపుకుని పాదాలకు రాసుకుంటే?

ఈ కాలంలో పాదాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని పాదాలకు రాసుకుని 10 నిమ

ఈ కాలంలో పాదాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని పాదాలకు రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. 45 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోతాయి.
 
పచ్చిపాలలో చక్కెర కలుపుకుని పాదాలకు, అరికాళ్లకు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు మృదువుగా మారుతాయి. తేనెలో కొద్దిగా పసుపు కలుపుకుని పాదాలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి.