సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (17:20 IST)

వింటర్లో సిల్కీ హెయిర్ కోసం.. రోజ్‌మెరీ ఆయిల్ మసాజ్ చేసుకోండి.

వింటర్‌లో సిల్కీ హెయిర్ పొందాలంటే ఈ చిట్కాలు ఉపయోగించండి. వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి నూనెలో ఐదు చుక్కల రోజ్మెర్రీ ఆయిల్‌ను మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ ఐదు చుక్కల జుట్టుకు రాస్తే జుట్టు సున్న

వింటర్‌లో సిల్కీ హెయిర్ పొందాలంటే ఈ చిట్కాలు ఉపయోగించండి. వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి నూనెలో ఐదు చుక్కల రోజ్మెర్రీ ఆయిల్‌ను మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ ఐదు చుక్కల జుట్టుకు రాస్తే జుట్టు సున్నితంగా తయారవుతాయి. గులాబీ రేకులను ఎండలో 24 గంటలు ఎండబెట్టి, డార్క్ బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులో మొదట వేడి చేసుకున్న ఆయిల్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. 
 
పొడి జుట్టు, చిక్కు ఎక్కువగా ఉన్నట్లైతే, ఈ హెయిర్ మాస్క్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసుకుని జుట్టుకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే జుట్టు నిగారింపును సంతరించుకుంటుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకున్న ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. మన్నికైన షాంపు ఉపయోగించాలి. కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.