శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:26 IST)

వర్షాకాలంలో హెయిర్ కేర్ టిప్స్: పెరుగు లేదా రిఫైన్డ్ ఆయిల్ రాసుకుంటే?

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వర్షాకాలంలో జుట్టు పాడవకుండా ఉండాలంటే.. తలమాడు చల్లగా, దురదగా వుంటే వేప నూనె రాసుకోవాలి. నూనెలో నిమ్మకాయ లేదా కరివేపాక

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వర్షాకాలంలో జుట్టు పాడవకుండా ఉండాలంటే.. తలమాడు చల్లగా, దురదగా వుంటే వేప నూనె రాసుకోవాలి. నూనెలో నిమ్మకాయ లేదా కరివేపాకులు కలిసి రాసుకుంటే కురులు బాగా పెరుగుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
ఇక చుండ్రు అధికంగా ఉంటే తలకు పెరుగు లేదా రిఫైన్డ్ ఆయిల్ గానీ రాసుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. తడిగా వున్నప్పుడు తలను దువ్వకూడదు. ఒక వేళ దువ్వితే కురులు బలహీనపడే అవకాశాలు ఎక్కువ. 
 
అలాగే హెయిర్ కలరింగ్, స్ట్రెయిట్నింగ్ లాంటివి ఈ కాలంలో చేయించుకోకపోవడమే ఉత్తమం. తలకు వీలైనంత వరకు హెర్బల్ షాంపును గాని, యాంటీ డాండ్రఫ్ షాంపూను వాడాలి. వారానికి 2, 3 సార్లు తలస్నానం చేయాలి. తలను హెయిర్ డ్రైయిర్‌తో పోడి చేయకూడదు. వీలైనంతవరకు మెత్తని టవల్‌తో తుడుచుకోవడం మంచిదని బ్యూటీషన్లు అంటున్నారు.