గ్రీన్‌టీని మీ తలకు కండీషనర్‌లా రాసినట్లయితే?
ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జుట్టు రాలిపోతుండటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే, ఎక్కువ శ్రమపాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే జుట్టును సంరక్షించుకునే పద్ధతులు ఉన్నాయి. ఈ ఆరు చిట్కాలను పాటిస్తే సమస్య నుండి బయటపడవచ్చు.
కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాయండి. ఆ తర్వాత మునివేళ్లతో తలను బాగా మర్దనా చేయండి. దీనివల్ల వెంట్రుకల కుదళ్లలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. మీరు ఉల్లిపాయను జ్యూస్‌లా చేసి తలకు పట్టించాలి. మునివేళ్లతో తల మొత్తం మర్దనా చేయాలి. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల తలలో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి.
పోషకాల లోపం వల్ల కూడా జుట్టు ఊడే అవకాశం ఉంది. రోజూ బీట్‌రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్‌టీని మీ తలకు కండీషనర్‌లా రాసినట్లయితే వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి. విటమిన్-సి లోపం వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో రిచ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి. ఇవి చుండ్రు, తల మంటను తగ్గిస్తాయి.
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చుండ్రును నివారించడమే కాకుండా జుట్టు మొదళ్లను బలోపేతం చేస్తుంది. షాంపూతో తలంటుకున్న తర్వాత వేపాకుల మిశ్రమాన్ని తలకు రాయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.