చుండ్రుకు చెక్ పెట్టే.. నిమ్మరసం..?
చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయిన కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని
చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
నిమ్మరసాన్ని కొద్దిగా నీరు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాతు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమంతప్పకుండా చేస్తే ఇక చుండ్రు అసలు రాదు.
కొంతమందికి జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు ఏం చేయాలంటే... అరటిపండు గుజ్జును తలకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా నెలరోజుల పాటు చేయడం వలన మీకే తేడా తెలుస్తుంది. చాలామందికి పళ్ళు పసుపుపచ్చగా ఉంటాయి. అలాంటనప్పుడు అరటిపండు తొక్కను పళ్ళపై రుద్దుకుని బ్రష్ చేసుకుంటే తెలుపుగా మారుతాయి.