శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : గురువారం, 26 మే 2016 (15:42 IST)

మ్యాంగోతో ఫేషియల్ టిప్స్...

వయస్సు పెరిగే కొద్దీ చర్మం కాంతిని కోల్పోతుంది. చర్మం కమిలిపోవడం, ముడతలు పడడం, వంటివి అధికంగా జరుగుతాయి. దాని వల్ల చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనిపిస్తారు. విటమిన్ లోపం వల్ల కూడా చర్మం కమలడం, చిట్లడం వంటివి జరుగుతాయి. కాబట్టి విటమిన్‌-ఎ అధికంగా ఉన్న ఆకుకూరలు, పండ్లను అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. ముఖ్యంగా టొమాటో, బొప్పాయి, మామిడి, క్యారెట్‌ మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో అధికంగా దొరికే మామిడి పండ్లతో కూడా చర్మసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. మామిడి పండు వేసవి తాపాన్నిపోగొట్టడం మాత్రం కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.
 
మొటిమలు, మచ్చలతో బాధపడేవారు మామిడిపండ్లతో ఫేషియల్స్ చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం....
 
ముందుగా మామిడి పండ్ల ముక్కలను తీసుకుని ముఖం మీద స్క్రబ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్నట్లైతే పొడిబారిన చర్మం సున్నితంగా తయారవుతుంది. 
 
మామిడిపండును గుజ్జులా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నిమ్మరసం, తేనె కలిపి ముఖం, మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి సహజంగా మారుతుంది. 
 
మామిడి పండు రసాన్నిఅందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిపోతాయి. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది.