ఓట్స్‌తో అందం.. ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌, ఆలివ్‌ నూనెతో..?

Last Updated: ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (17:15 IST)
ఓట్స్‌ని గోరువెచ్చని నీళ్లతో కలిపి మెత్తగా చేసి ఒంటికి పట్టించి, మృదువుగా మర్దన చేసి, ఓ అరగంట తరవాత కడిగేయడం వల్ల చర్మంమీద ఉన్న మృతకణాలు తొలగిపోవడంతోబాటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఓట్స్‌లోని జింక్‌ కారణంగా మొటిమలూ వాటి కారణంగా ఏర్పడే మచ్చలూ తొలగిపోతాయి. 
 
కప్పు ఓట్స్‌లో రెండు కప్పుల మరిగించిన నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బి అందులో టేబుల్‌స్పూను నిమ్మరసం, టీస్పూను ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌, టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి రెండు నిమిషాలాగి కడిగేయాలి. దీనివల్ల చుండ్రు తగ్గుతుంది.
 
అరకప్పు పాలల్లో 3 టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ పొడి, టేబుల్‌స్పూను కొబ్బరినూనె వేసి బాగా కలిపి జుట్టుకి మాస్క్‌లా వేసి అరగంట తరవాత షాంపూ చేసినా జుట్టు చక్కగా మెరుస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :