ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (22:36 IST)

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే

చర్మ సౌందర్యం కోసం మహిళలు పడే ఆరాటం అంతాఇంతా కాదు. ఇందుకోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమోటాలతో నిగారింపు సాధించుకోవచ్చు. టమోటో ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెల్సుకుందాం.
 
రెండు టమోటోలను గుజ్జుగా చేసి అందులోకి ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిపి మిక్స్‌ చేయాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.
 
టమోటోల గుజ్జు వేసి అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో కాంతివంతంగా మారుతుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టమోటో రసం, మూడు టీస్పూన్ల మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టమోటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. 
 
ఒక టమోటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి ఫలితం దక్కుతుంది.
 
రెండు టమోటోలను గుజ్జుగా చేసుకోవాలి. అందులో ఓట్‌మీల్‌, పెరుగు ఒక టేబుల్‌ స్పూన్‌ వేసి మిశ్రమంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.