శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (11:15 IST)

పాదాల పగుళ్లు పోవాలంటే.. బరువు తగ్గాలట..

foot crack
పొడి చర్మం- అధిక శరీర బరువు పాదాల పగుళ్లకు ముఖ్యమైన కారకాలు. మన శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు చర్మం పొడిబారడంతోపాటు పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో, వర్షాకాలంలో చర్మం సహజంగా పొడిబారినట్లు అనిపిస్తుంది. దీని వల్ల పాదాలపై పొక్కులు వచ్చే అవకాశం ఉంది. 
 
పాదాల చర్మం సాధారణంగా మందంగా ఉంటుంది. దాని లోపల కొవ్వు పొర ఉంటుంది. శరీరం అధిక బరువుతో ఉంటే, పొర మారడం, చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. అందుచేత రోజూ పాదాలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే ఉదయం, రాత్రి వేళల్లో నీళ్లతో పాదాలను శుభ్రంగా కడుక్కుంటే పగుళ్లతో ఇబ్బంది వుండదు. కలబంద, కొబ్బరి నూనెను పాదాళ్ల పగుళ్లపై అప్లై చేయవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలి.
 
పాదాల పగుళ్లు దూరమవ్వాలంటే.. షూస్ వాడాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే స్థూలకాయం ఉన్నవారు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని వైద్యులు చెప్తున్నారు.