శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:20 IST)

తెల్లవెంట్రుకల సమస్య, ఇలా చేస్తే...

ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను రంగరించి మాడుకు పట్టిస్తే జుట్టు రాలడం సమస్యను అధిగమించవచ్చు. హెన్నా మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం ద్వారా దట్టమైన జుట్టుతో పాటు.. శిరోజాలకు అవసరమైన పోషకాలు అందుతాయి.
 
నెలలో రోజుకు రెండుసార్లు తలకు ప్యాక్ వేయాలి. తద్వారా, దెబ్బతిన్న కురులు మరలా ఆరోగ్యకరంగా తయారవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, హెన్నా చుండ్రుతో సమర్థంగా పోరాడుతుంది. రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బాలి. ఆవాల నూనెను మరిగించి గోరింట ఆకులను దాంట్లో వేయాలి. చల్లారిన తర్వాత మెంతుల చూర్ణాన్ని దానికి కలిపి మాడుకు పట్టించాలి. ఈ మిశ్రమం చుండ్రుపై బాగా పనిచేస్తుంది.
 
ఇక, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని బాధపడేవారికి ఇది మంచి నేస్తం. నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేసి బాగా కలియదిప్పాలి. 
 
అప్పుడు హెన్నా కలిపి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు కానీ, లేక, రాత్రంతా కానీ దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. దీన్ని రాసుకోవడం ద్వారా తెల్లవెంట్రుకలు కాసింత రంగు పులుముకుంటాయి.