శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆగస్టులో బ్యాంకులకు సెలవలే సెలవులు...

వచ్చే నెల ఆగస్టు. ఈ నెలలో బ్యాంకులకు అనేక సెలవులు రానున్నాయి. దీంతో ఖాతాదారులు జాగ్రత్త పడటం మంచిది. జూన్, జులై నెలలో బ్యాంకు సెలవులు తక్కువగా ఉండగా, ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం. 
 
దీంతో చెక్ క్లియరెన్స్, రుణాలు పొందేవాళ్లు మాత్రం బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. సెలవులపై అవగాహన కలిగి ఉంటే మంచిది. ప్లానింగ్ సులువుగా ఉంటుంది. ఆగస్టు నెలలో ఉన్న సెలవులను ఒసారి పరిశీలిద్దాం..
 
ఆగష్టులో మొత్తం 31 రోజులు ఉండగా ఆగస్టు 1వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. ఆగస్టు 8వ తేదీన కూడా రెండో ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగస్టు నెల 13వ తేదీన ఇంఫాల్ జోన్‌లో మాత్రం బ్యాంకు సెలవు కాగా మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయి. 
 
ఆగస్టు 14 రెండో శనివారం కాగా ఆగస్టు 15వ తేదీ ఆదివారం కావడం, స్వాతంత్ర దినోత్సవం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగస్టు 16వ తేదీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సెలవు దినంగా ఉంది. ఆగస్టు 19వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా సెలవుదినం కాగా ఆగస్టు 20వ తేదీన ఓనం కారణంగా సెలవు దినంగా ఉంది. 
 
ఆగష్టు 22 ఆదివారం సెలవు దినం కాగా ఆగస్టు 28 నాలుగో శనివారం సెలవుగా ఉంది. ఆగస్టు 29 ఆదివారం సెలవు కాగా ఆగస్టు 30 జన్మాష్టమి, ఆగస్టు 31 కృష్ణాష్టమి కావడంతో హైదరాబాద్‌లో బ్యాంక్ సెలవుగా ఉంది.