1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:21 IST)

247అరౌండ్, గృహోపకరణాల మరమ్మతు కోసం ఉచిత జాతీయ వీడియో హెల్ప్‌లైన్‌

ప్రముఖ ఉపకరణాల సేవలను అందించే 247అరౌండ్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మధ్య, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఉచిత జాతీయ వీడియో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం, వాట్సాప్ మరియు గూగుల్ మీటింగ్ ఇంటిగ్రేషన్‌ను, 247 రౌండ్ యాజమాన్య సాఫ్ట్‌వేర్‌పై ఉపయోగిస్తుంది.
 
ఇంటి నుండి పనిచేసే సంస్థ ఉద్యోగులచే పనితీరు యొక్క, ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ - 9555000247 ద్వారా అపాయింట్‌మెంట్లను సజావుగా బుక్ చేసుకోవడానికి వినియోగదారులకు వీలుకల్పిస్తుంది. పరికరాలను మరమ్మత్తు చేయడానికి తగిన సాంకేతిక నిపుణుల వద్దకు వెళ్ళడానికి ప్రస్తుతం వీలుకానందున ఇది వినియోగదారులకు ఒక వరం లాంటిది. సాంకేతిక నిపుణులు, అధిక నైపుణ్యం, అనుభవజ్ఞులు మరియు రిమోట్ డయాగ్నొస్టిక్ పద్ధతుల్లో శిక్షణ పొందినవారు, అందుచేత, రిఫ్రిజిరేటర్లు, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, గ్యాస్ బర్నర్స్ వంటి ఉపకరణాలను ఆన్‌లైన్‌లో ఈ సేవలను వినియోగించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.
 
తన ఆలోచనలను పంచుకుంటూ, 247అరౌండ్ సిఇఓ మరియు సహ వ్యవస్థాపకుడు - నితిన్ మల్హోత్రా ఇలా అన్నారు, “పరిశ్రమ ప్రతి 30 రోజులకు మరమ్మత్తు కోసం 25 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందుకుంటోంది. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిమాణం. గ్యాస్ బర్నర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎసి, వాషింగ్ మెషిన్ మరియు డిష్వాషర్లు ఆన్‌లైన్‌లో మేము మరమ్మత్తు సేవలను అందింస్తున్న వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఉపకరణాలు. వీడియో మరమ్మత్తు యొక్క విజయ నిష్పత్తి 25-30%. మేము ఈ కస్టమర్లను ఆనందపరచగలిగినందుకు సంతోషంగా ఉన్నాము."
 
2015లో స్థాపించబడిన, 247అరౌండ్, భారతదేశం అంతటా 10,000+ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తుంది. షార్ప్, బోట్, వర్ల్ పూల్, గోద్రేజ్ హిట్, వీడియోకాన్, అకాయ్ మరియు లైఫ్లాంగ్ వంటి ప్రముఖ గృహోపకరణాల బ్రాండ్లకు భాగస్వామిగా ఉంది.