శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 జులై 2021 (18:04 IST)

నకిలీ ఉత్పత్తుల వాణిజ్యంపై కఠినమైన చర్యలను తీసుకోవాలి: వ్యవసాయ, నిర్మాణ యంత్రసామాగ్రి తయారీదారులు

ఫిక్కీ కాస్కేడ్‌ నివేదిక ప్రకారం, భారతీయ ఆర్ధిక వ్యవస్థ 1,17,253 కోట్ల రూపాయలను అత్యంత ప్రాచుర్యం పొందిన క్యాపిటల్‌ గూడ్స్‌ (యంత్రాలు మరియు విడిభాగాలు) మరియు కన్స్యూమర్‌ (ఎలకా్ట్రనిక్‌ ) డ్యూరబల్స్‌ సహా ఐదు రంగాలలో నకిలీ మరియు మోసపూరిత ఉత్పత్తుల కారణంగా నష్టపోయింది. నకిలీ ఉత్పత్తుల విక్రయాలు అంతర్జాతీయంగా రెట్టింపు కావడంతో పాటుగా 2022 నాటికి 119.7 లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని అంచనా. ఈ ప్రమాదానికి ఇండియా ఏ మాత్రం మినహాయింపు కాదు.
 
ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటుగా మార్కెట్‌లో దీని పట్ల విస్తృతశ్రేణిలో  ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి లక్షణాలను అనుసరించి అతి సులభంగా అసలైన ఉత్పత్తులను గుర్తించడంతో పాటుగా బ్రాండ్‌  యొక్క ఆధీకృత అమ్మకం, సేవా మార్గాలను అతి సులభంగా చేరుకునేందుకు తగిన అవకాశాలనూ కల్పించాల్సి ఉంది.
 
భారతదేశంలో దాదాపు 35 సంవత్సరాలుగా పవర్‌ ప్రొడక్ట్స్‌ రంగంలో అగ్రగామి కంపెనీగా వెలుగొందుతున్న హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ (HIPP) ఈ నకిలీ భూతంతో పోరాడుతూనే ఉంది. HIPP తమ ‘నో యువర్‌ హోండా’(మీ హోండా గురించి తెలుసుకోండి) ప్రచారం ఆరంభించడంతో పాటుగా తమ విలువైన వినియోగదారులకు తమ ఐపీ సెల్‌ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ సేల్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ను చురుగ్గా పర్యవేక్షించడం ద్వారా ఏదైనా అనుమానాస్పద చర్య కనబడితే, చట్ట విరుద్ధంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న వారిపై అత్యంత కఠినమైన చర్యలను  తీసుకుంటుంది.
 
ఈ నకిలీల చుట్టూ అల్లుకున్న ప్రమాదాలను  గురించి సుప్రసిద్ధ కన్స్యూమర్‌ యాక్టివిస్ట్‌ ప్రొఫెసర్‌ బె జాన్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద  సమస్యగా నకిలీ మారింది. ఈ నకిలీ ప్రభావంతో దాదాపుగా అన్ని పరిశ్రమ రంగాలూ  ప్రపంచ వ్యాప్తంగా  సతమతమవుతున్నాయి. ఇండియా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ తరహా మోసపూరిత ప్రయత్నాలు నేరుగా ఆరోగ్యం, ఆర్థికం,  విద్య, సమాజంపై ప్రభావం చూపుతాయి. భారతదేశం ఇప్పుడు గణనీయమైన రీతిలో ఆర్ధిక, ఆరోగ్య, భద్రతా ప్రభావాలను ఈ విస్తృత శ్రేణి హానికరమైన అభ్యాసాల కారణంగా ఎదుర్కొంటుంది.
 
అన్ని పరిమాణాలు మరియు స్థాయిల వ్యాపారాలలోనూ  విస్తృతశ్రేణిలో  నకిలీ సాంకేతికత లేదా యంత్రసామాగ్రి కనిపిస్తుంది మరియు  ఊహాతీత ఖర్చులను యంత్రసామాగ్రి పాడవడం, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోవడం మరియు అమలు చేయలేని వారెంటీలతో చేయాల్సి వస్తుంది. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా వినియోగదారుల నడుమ అవగాహన కల్పిస్తూనే, వినియోగదారులకు తగిన శక్తినందించేందుకు తగిన ప్రమాణాలను సైతం బలోపేతం చేయడం ద్వారా సమాచారయుక్త ఎంపికలకు తగిన సాధికారితను అందిస్తుంది. ఇది ఈ తరహా మోసపూరిత వ్యక్తులను దూరంగా ఉంచడంతో పాటుగా ఈ సమస్యను పొగొట్టడంలోనూ సహాయపడుతుంది’’అని అన్నారు.
 
హోండా బ్రాండ్‌ పవర్‌ ప్రొడక్ట్స్‌, పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా గత మూడు దశాబ్దాలుగా నిలుస్తున్నాయి మరియు విభిన్న రంగాలలో వీటిని అపూర్వంగా ఆదరిస్తున్నారు. ఈ రంగాలలో వ్యవసాయం నుంచి నిర్మాణం వరకూ ఉన్నాయి. ఈ ప్రమాణాలే నకిలీ తయారీదారులు సైతం దృష్టి సారించేందుకు కారణమవడమూ జరుగుతుంది.
 
ఫిక్కీ కాస్కేడ్‌ నివేదిక ప్రకారం, అక్రమ రవాణా, నిషేదిత, నకిలీ మరియు పైరేటెడ్‌ ఉత్పత్తుల వాణిజ్యం స్థిరంగా గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ ఉత్పత్తుల వాటా 3.3 % ఉంది. నకిలీ ఉత్పత్తుల యొక్క ఈ పెరుగుదల పలువురు వినియోగదారుల ఉద్యమకారులతో పాటుగా చట్టాలను అమలు చేసే వ్యక్తులకూ ఆందోన కలిగిస్తుంది.
 
గత కొద్ది సంవత్సరాలుగా ఈ సమస్య మరింత తీవ్రతరమైంది. చుట్టు పక్కల అభివృద్ధి చెందుతున్న దేశాలలోని  ధృవీకృతం కాని ప్లేయర్లు స్థానికంగా తమ కార్యకలాపాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలో,  సుప్రసిద్ధ నగరాలు అయినటువంటి కోల్‌కతా, చెన్నై, ముంబై మరియు ఢిల్లీ వీటికి ఫీడర్‌ మార్కెట్‌లుగా నిలుస్తుండటంతో పాటుగా మోసపూరిత వ్యక్తులకు కేంద్రంగా నిలుస్తున్నాయి. ఇక్కడ నుంచి నకిలీ ఉత్పత్తులు, ఽఅసలైన ఉత్పత్తులతో పోలిస్తే నాణ్యత, ధర తక్కువలో ఉండే అనుకరణ ఉత్పత్తుల సరఫరా జరుగుతుంది.
 
భారతప్రభుత్వం ఈ నకిలీఉత్పత్తుల సమస్యను పరిష్కరించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో భాగంగా తమ ఐపీ లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ మెరుగుపరచడం, చట్టాలను అమలు చేసే వ్యవస్థలను బలోపేతం చేయడం, తమ ఐపీ అడ్మిన్‌స్ట్రేషన్‌ను ఆధునీకరించడం చేస్తుంది. కొన్ని ప్రధానమైన మైలురాళ్లలో, కంప్యూటరైజేషన్‌ స్ధాయిని మెరుగుపరచడం, పలు ఆఫీసుల వ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించడం, ట్రేడ్‌ మార్క్‌ మరియు పేటెంట్‌ అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌లో ప్రాసెస్‌ చేయడం మరియు  మేథోసంపత్తి రికార్డులను కంప్యూటరకరణ చేయడం ద్వారా డాటా బేస్‌ను సృష్టించడం వంటివి ఉన్నాయి.