శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (12:52 IST)

గణేష్, శివుడు, ఓంకారం చిత్రాలతో డోర్‌మ్యాట్లు - బాత్రూం రగ్స్

ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా హిందూదేశమైన భారతదేశంలో సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ దేశప్రజల్లో భక్తిభావం నిండుగా ఉంటుంది. తమతమ మనోభావాలకు అనుగుణంగా వారు తమకు నచ్చిన దైవాన్ని ఇష్టపడి, పూజిస్తుంటారు. అలాంటి దేవుళ్ళకు ఏ చిన్నపాటి అవమానం జరిగినా ఎంతమాత్రం సహించరు.

కానీ, ఈకామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ మాత్రం హిందూ దేవుళ్ళ చిత్రాలతో కూడిన డోర్‌మ్యాట్స్, బాత్రూమ్ రగ్స్ తయారు చేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆ సంస్థపై భారత వినియోగదారులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్‌ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్‌ కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు.
 
'సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి' అని నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్‌లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. 
 
మరోవైపు, కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్‌ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింది. కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.