అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025, ఎర్లీ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, 2025కి ముందు అమెజాన్ డాట్ ఇన్ ఎర్లీ డీల్స్‌ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లకు ఉత్కంఠభరితమైన ప్రీ-ఫెస్టివల్ ఆఫర్లను సెప్టెంబర్ 13 మొదలుకుని అందిస్తుంది. ముఖ్యమైన ఫెస్టివల్ సెప్టెంబర్ 23న ప్రారంభం అవుతుంది. ప్రైమ్ సభ్యులకు 24-గంటలు ముందస్తుగా యాక్సెస్ లభిస్తుంది. ఈ సంవత్సరం షాపింగ్ ఫెస్టివల్, మరింత విస్తృతమైన డెలివరీ నెట్వర్కుల ద్వారా, AI-శక్తి కలిగిన షాపింగ్ టూల్స్‌తో, పండుగ సంబరాలను పరిపూర్ణం చేసేందుకు ప్రత్యేకమైన ఎంటర్టెయిన్మెంట్ ఆప్షన్లతో మరింత ఆనందకరమైన షాపింగ్ అనుభవాన్ని తీసుకువస్తోంది.
మొత్తం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అందుబాటులో ఉన్నంతకాలం ప్రైమ్ మెంబర్లు అమూల్యమైన విలువను పొంది ఆనందిస్తారు. 24 గంటలు ముందస్తుగా అందుబాటులోకి వచ్చే సౌకర్యం మాత్రమే కాక, ప్రైమ్ మెంబర్లు ప్రైమ్ ధమాకా ఆఫర్లు- ప్రత్యేకమైన లైటింగ్ డీల్స్‌ను అన్లాక్ చేసుకోవచ్చు. ప్రైమ్-మాత్రమే ఆఫర్లు ఫెస్టివల్ కాలం అంతటా అందుబాటులో ఉంటాయి.
అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ ద్వారా షాపింగ్ చేసుకోగలిగిన కంటెంట్ ద్వారా డీల్సును షోకేస్ చేసేందుకు 1 లక్షకు పైగా క్రియేటర్లతో అమెజాన్ ఎంగేజ్ అవుతుంది. వారిలో సమీరా రెడ్డి, రాజీవ్ మఖ్నీ, రన్వీర్ బ్రార్లు ఉంటారు. 3,000లకు పైగా క్రియేటర్లతో ఎలివేట్, ఫ్యాషన్, హోమ్, కొత్త టెక్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యేకమైన ప్రోగ్రామ్లు ఈ కార్యక్రమంలో ఉంటాయి.
షాపింగ్, లాభదాయకంగా ఉండేందుకు అమెజాన్ పే లేటర్ ఆఫర్ చేస్తోంది ప్రత్యేకమైన నో-కాస్ట్ EMI ప్లాన్లు. ఇవి ఫ్యాషన్, వంటగది ఉపకరణాలు, ఇంకా మరిన్నింటిపై రాబోయే మూడు నెలల పాటు లభిస్తాయి. అర్హులైన కస్టమర్లు, అమెజాన్ డాట్ ఇన్లో షాపింగ్, రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, ట్రావెల్ బుకింగుల పై రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్ను పొందవచ్చు. రివార్డ్స్ గోల్డ్ కార్యక్రమం ద్వారా, గత మూడు నెలల్లో 25 లావాదేవీలను పూర్తి చేసుకున్న కస్టమర్లు, ఎంపిక చేసిన విభాగాలలో తప్పక లభించే 5% క్యాష్బ్యాక్‌ను (ప్రైమ్ మెంబర్లు కానివారికి 3%) పొందగలుగుతారు.