గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:41 IST)

2022-23లో 60 వేల కోట్ల రూపాయల విలువైన ఋణాలను పంపిణీ చేసిన ఆండ్రోమెడా

image
భారతదేశంలో అతిపెద్ద ఋణ పంపిణీ నెట్‌వర్క్‌, ఆండ్రోమెడా సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ గణనీయమైన వృద్ధిని తమ ఋణ వితరణ పరంగా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నమోదు చేసింది. ఈ  ఋణ వితరణ దాదాపు 63% వృద్ధితో 60 వేల కోట్ల రూపాయలకు చేరింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ, ఋణ పంపిణీ పరంగా ఆండ్రోమెడా యొక్క వృద్ధి గణనీయంగా ఉంది. ఈ కంపెనీ తమ వృద్ధిని కొనసాగించడంతో పాటుగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12-15% వృద్ధిని సాధించగలదని అంచనా వేస్తోంది.
 
సిటిబ్యాంక్‌కు సేల్స్‌ అసోసియేట్‌గా 1991లో ఆండ్రోమెడా కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రధానంగా గృహ ఋణాలు, లోన్‌ ఎగైనెస్ట్‌  ప్రోపర్టీ, వ్యక్తిగత ఋణాలు, వ్యాపార ఋణాలను సంస్థ అందిస్తుంది. ఆండ్రోమెడా సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కో-సీఈఓ రావౌల్‌ కపూర్‌ మాట్లాడుతూ మే 2022లో కీలక వడ్డీ రేట్లు పెంచినప్పటికీ గృహ ఋణాలపై అది ప్రభావం చూపలేదని, భవిష్యత్‌లో ఈ వడ్డీరేట్లు తగ్గుతాయనే నమ్మకంలో గృహ కొనుగోలుదారులున్నారన్నారు. భవిష్యత్‌ పట్ల ఆశాజనకంగా ఉన్న కపూర్‌, రాబోయే కొద్ది సంవత్సరాలలో ఇండియా మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్ధగా మారనుందన్నారు. ఆండ్రోమెడా కూడా గణనీయంగా వృద్ధి చెందుతుందంటూ 2018-19లో 36,842 కోట్ల రూపాయల ఋణాలనందిస్తే మార్చి 2023 నాటికి 60 వేల కోట్ల రూపాయల ఋణ వితరణ చేశామన్నారు.
 
శ్రీ కపూర్‌ మాట్లాడుతూ ఈ కంపెనీ అధికంగా సాంకేతికతపై ఆధారపడుతుందని, 25 వేలకు పైగా ఏజెంట్లు సంస్ధకు ఉన్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నామన్న ఆయన వడ్డీరేట్లు తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. గృహ కొనుగోలుదారుల నుంచి ఇప్పటికీ తాము పెద్ద సంఖ్యలో ఎంక్వైరీలను అందుకుంటున్నామంటూ కంపెనీ వృద్ధికి ఇది సానుకూల సూచనగా నిలుస్తుందన్నారు.