మూడు నెలల జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ
అనిల్ అంబానీకి జైలుశిక్ష తృటిలో తప్పింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. స్వీడన్ కేంద్రంగా పనిచేసే టెలికామ్ పరికరాల తయారీ సంస్థ అయిన ఎరిక్సన్‌కు ఆర్ కామ్ 462 కోట్ల రూపాయల బకాయి పడింది. సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ ఏడాది మార్చి 19లోపు ఎరిక్సన్‌ను బకాయిలను చెల్లించాలని లేని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేసింది. కాగా బకాయిలను చెల్లించడానికి తుది గడువు ఈరోజే కావడంతో 462 కోట్ల రూపాయలను ఎరిక్సన్‌కు చెల్లించింది. ఈ చెల్లింపుతో రెండు కంపెనీల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదానికి తెరపడింది.