గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (21:19 IST)

ఫ్యూచర్ గ్రూప్‌ రిటైల్ ఇక ముఖేష్ అంబానీ చేతికి..!

Reliance Retail
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌లో కొన్ని విభాగాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. గతంలో ఆగస్టు 29, 2020న ఈ కొనుగోళ్లు జరిగాయి. 
 
ఇక సెప్టెంబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లో మణిహారంలా పేరుపొందిన రిటైల్ బిజినెస్ విభాగాన్ని ముఖేష్ అంబానీకి అప్పగించింది. ఈ మెగా లావాదేవీతో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ విభాగాలు రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు (ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్) బదిలీ అవుతాయి. ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్ అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఓ భాగం. కాబట్టి, ఫ్యూచర్ గ్రూప్ నుంచి అవి రిలయన్స్ రిటైల్ గ్రూప్‌నకు బదిలీ అవుతాయి.
 
ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్ సేల్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ సముపార్జనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. నవంబర్ 10న దీనికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు తమ ట్విటర్ ఖాతాలో సీసీఐ వెల్లడించింది.