ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 జూన్ 2023 (21:59 IST)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఎవాల్వ్’ను ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

image
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు, భారతదేశంలో ఈవీ వికాసానికి మార్గదర్శి అయిన టాటా మోటార్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను కొనసాగిస్తూ నేడిక్కడ, దేశంలో ఈవీ స్వీకరణ పెరగడానికి యజమానుల భాగస్వామ్య ప్రయాణం కోసం టాటా ఈవీ యజమానులందరినీ ఒకచోట చేర్చే కార్యక్రమంగా ‘ఎవాల్వ్’ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ‘ఎవాల్వ్’ అనేది అనుభవపూర్వక డ్రైవ్‌లు, పెద్ద కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాలు, ఎక్స్‌ క్లూజివ్ రిఫరల్ ప్రయోజనాలతో కూడిన ఎక్స్‌ ఛేంజ్, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ కస్టమర్ ఫోకస్డ్ కార్య కలాపాలను కలిగి ఉంటుంది.
 
‘ఎవాల్వ్’ ప్రారంభానికి నాయకత్వం వహించేలా టాటా మోటార్స్ నేడిక్కడ ఈ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం మొదటి దశను ప్రారంభించింది. ఇది దశలవారీగా ప్రారంభమయ్యే పరిమిత కాల రిఫరల్ ప్రోగ్రామ్. ఈ రివార్డ్ ప్లాన్ కస్టమర్‌లకు టాటా ఈవీ కుటుంబాన్ని వృద్ధి చేయడానికి వారి మద్దతుపై ప్రత్యేక అనుభవాల రూపంలో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. టాటా ఈవీ కమ్యూనిటీకి స్నేహితులు, కుటుంబ సభ్యులను జోడించడం ద్వారా కస్టమర్‌లు మచుపిచ్చు, ఐస్‌లాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు క్యూ రేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్రాండ్‌స్లామ్‌ లైవ్ చూసే అవకాశం పొందడం దాకా గరిష్ట మార్పిడుల ప్రయోజనాలతో హామీ ఇవ్వబడిన బహుమతులను గెలుచుకునే అవకాశం పొందుతారు. ఈ ప్రత్యేకమైన ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కంపెనీకి సంబంధించిన టాప్ 13EV వినియోగదారు మార్కెట్‌లు/క్యాచ్‌మెంట్ ఏరియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
 
‘ఎవాల్వ్’ ప్రారంభం గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎండీ శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ఈవీ విప్లవం టాటా మోటార్స్ ద్వారానే ప్రారంభించబడింది, అయితే దీనికి నిజమైన ప్రేరణ మా కొనుగోలుదారులు. వారు తమ కార్ల విషయంలో మాత్రమే కాకుండా పర్యావరణం కోసం తమ వంతు కృషి చేయడంపై కూడా దృష్టి సారిస్తారు. అన్ని సమయాల్లో కమ్యూనిటీని మెరుగుపరుస్తారు. ‘ఎవాల్వ్’ అనేది ఈ అనుబంధాన్ని మరింత పెంచడానికి, భారతదేశం నంబర్‌ 1 ఈవీ తయారీదారుగా మారడంలో మాకు సహాయపడినందుకు మా బ్రాండ్ అంబాసిడర్‌లకు రివార్డ్ చేయడానికి మా విస్తృత ప్రయత్నం’’ అని అన్నారు.
 
అనుభవాలు, చర్చా వేదికలు, లాయల్టీ పాయింట్లు, ప్రయోజనాలు మొదలైన వాటితో మా ఈవీ కమ్యూనిటీకి కేంద్రంగా మారాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న కొనుగోలుదారు స్నేహపూర్వక, ఆకర్షణీయమైన ప్రోగ్రామ్ ఇది. మా ఉద్దేశాలకు పర్యాయపదంగా ఉండే సందర్భంలో ‘ఎవాల్వ్’ మొదటి దశను ప్రారంభించడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిమిత వ్యవధి రెఫరల్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా, 'డబ్బు కొనుగోలు చేయలేని' ప్రోత్సాహకాలను మిళితం చేస్తుంది. మీలో ప్రతి ఒక్కరు అదే అనుభూతిని పొందుతున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేం మా ఈవీని నమ్మినవారి కోసం అసమానమైన ఆనందదాయక మార్గాలను అన్వేషించే దిశగా పని చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు మరింత మంది ప్రజలను #EvolveToElectric వైపు ప్రేరేపిస్తాయని, పచ్చదనం, పరిశుభ్రమైన భవిష్యత్తును సృష్టిస్తాయని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.