శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:37 IST)

భారత బ్యాంకులపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ : హెచ్‌డీఎఫ్‌సీలో వాటా

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నేలచూపుచూస్తున్నాయి. దీంతో అనేక కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. దీన్ని తనకు అవకాశంగా మలచుకునేందుకు డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంకు అయిన హెచ్‌.డి.ఎఫ్.సి లో ఒక శాతం వాటాను గుట్టుచప్పుడుకాకుండా కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కొనుగోలు జరిగింది. 
 
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన సమయంలో 25 శాతం ధర తగ్గిన దశలో 1.75 కోట్ల షేర్లను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చడీచప్పుడు లేకుండా కొనుగోలు చేసింది. 
 
కాగా, ఈ బ్యాంకులో ఆ బ్యాంకు అప్పటికే 0.8 శాతం వాటాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో ఈ వాటా ఒక శాతాన్ని మించిపోయింది. దీంతో ఈ విషయం బహిర్గతం చేయాల్సి వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్-చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు.