శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:22 IST)

దేశంలో కరెన్సీకి కరవు .. ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే

దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లకు కరవు ఏర్పడింది. ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో జనం కరెన్సీ నోట్లకు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి నిన్నా మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఏ

దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లకు కరవు ఏర్పడింది. ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో జనం కరెన్సీ నోట్లకు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి నిన్నా మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఏటీఎం‌ల్లోని నో క్యాష్ బోర్డులు కనిపించేవి. ఇపుడు ఇప్పుడు దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.
 
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 80 శాతం ఏటీఎం‌లలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని చేసే ఏటీఎంల్లోనూ వందల మంది క్యూ. అలా డబ్బు పెడితే.. ఇలా అయిపోతుంది. బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ ఏరియాలోని ఏటీఎంల్లోనూ డబ్బు లేదు అనే బోర్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సీఎంతోపాటు ఇతర ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో రెండు రోజులుగా ఏటీఎం సెంటర్లలోనూ నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. 
 
ఇక మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్పందించారు. మార్కెట్‍లో 2 వేల నోట్లు కనిపించటం లేదని.. ఈ నోట్లు ఎక్కడికి వెళ్లాయి అని అధికారులను ప్రశ్నించారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 85 శాతం ఏటీఎంలు 48 గంటలుగా పని చేయటం లేదు.
 
దేశంలోని నగదు కొరత నోట్ల రద్దు నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా డబ్బు లేదు అనే మాట వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత రిజర్వు బ్యాంకు స్పందించింది. వరుసగా వచ్చిన పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లతో నగదు కొరత ఏర్పడిందని.. మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు.