చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లపై ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకంపై భద్రతాపరమైన ఆందోళనలు అంతటా పెరుగుతున్నాయి. గతంలో, ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులకు డీప్‌సీక్ వాడకాన్ని నిషేధించింది. ప్రస్తుతం భారతదేశం కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగా
కార్యాలయ పరికరాల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగించకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేసింది.
ప్రభుత్వ డేటా, పత్రాల గోప్యతతో AI అప్లికేషన్‌లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను ఆర్థిక కార్యదర్శి సలహా హైలైట్ చేస్తుంది. ఈ సలహా ప్రత్యేకంగా చాట్‌జీపీటీ, డీప్‌సీక్ గురించి ప్రస్తావిస్తుంది. ఈ AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆదేశించింది.
ఎందుకంటే అవి డేటా భద్రతకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఈ అడ్వైజరీ జనవరి 29, 2025న జారీ చేయడం జరిగింది. ఇంకా సెన్సివిటీ సమాచారాన్ని రక్షించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది.