గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (12:23 IST)

రూ.799కే విమాన టికెట్‌.. (పన్నులు, ఇతర ఛార్జీలు అదనం)

హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న విమానయాన సంస్థ ట్రూజెట్‌.. ‘గ్రేట్‌ టేక్‌ ఆఫ్‌ సేల్‌’ పేరుతో విమాన టిక్కెట్‌లను తక్కువ ధరకే విక్రయించే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.799 ప్రారంభ ధర (పన్నులు అదనం)తో లక్ష వరకు సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. 
 
కాగా... ఈ టిక్కెట్‌లను మార్చి 8వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చుననీ, ఈ నెల 8వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చుననీ సంస్థ తెలియజేస్తోంది. ఉడాన్‌ పథకం కింద తమ వంతు సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉందని ట్రూజెట్‌ సీసీఓ సుధీర్‌ రాఘవన్‌ ఈ సందర్భంగా తెలియజేసారు.