శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (09:28 IST)

విజయవాడ నుంచి మస్కట్ - కువైట్‌లకు విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడ గన్నవరం నుంచి మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు మస్కట్, సింగపూర్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు అనుమతించారు. 
 
బుధవారం సాయంత్రం 6.10 గంటలకు 65 మందితో దుబాయ్ విమానం ఇక్కడికి చేరుకోనుంది. విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు రానున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
 
వందే భారత్ మిషన్‌లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.