శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:39 IST)

మెరుగైన సర్వీస్ డెలివరీ సామర్థ్యాలతో పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్‌ను తీర్చేందుకు సిద్ధమైన గతి

image
భారతదేశపు ప్రముఖ ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రొవైడర్ అయిన గతి ఎక్స్‌ప్రెస్ అండ్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ (GESCPL), పండుగ సీజన్‌లో వాణిజ్య విభాగం, అలాగే వైట్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు FMCG విభాగాలలో పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి తమ వేర్‌హౌసింగ్ మరియు డెలివరీ సామర్థ్యాలను పెంచింది. GESPL దాని నిరంతర సామర్థ్యం మరియు సమర్ధత మెరుగుపరిచే చర్యల కారణంగా సంవత్సరంలో ఎప్పుడైనా 20 శాతం ఎక్కువ కార్గో లోడ్‌లను నిర్వహించగలదు. 
 
ముంబై శివార్లలోని భివాండిలో 1.48 లక్షల చ.అ.లతో మెగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మరియు సాంకేతికత ఆధారిత  సర్ఫేస్ ట్రాన్‌షిప్‌మెంట్ సెంటర్ మరియు డిస్ట్రిబ్యూషన్ వేర్‌హౌస్ (STCDW), ఫరూఖ్ నగర్‌లో 1.5 లక్షల చదరపు అడుగుల సర్ఫేస్ ట్రాన్‌షిప్‌మెంట్ సెంటర్ (STC) అలాగే ఇండోర్, నాగ్‌పూర్, గౌహతి మరియు బెంగళూరులో (రాబోయే) STCలు వరుసగా 39,140 చదరపు అడుగులు, 50,000 చదరపు అడుగులు, 40,000 చదరపు అడుగులు మరియు 1.46 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. దేశం వ్యాప్తంగా   GESCPL తమ కార్యకలాపాల కారణంగా ఎక్కువ పరిధిని కవర్ చేస్తుంది. GESCPL ఈ  ప్రాంతాల్లోని SMEలకు పండుగ సీజన్‌లో మరింత భౌగోళికంగా విభిన్నమైన మార్కెట్‌లను నిర్మించడంలో సహాయం చేస్తుంది.
 
పండుగ సీజన్ కోసం తమ సంసిద్ధత గురించి శ్రీ రాజేష్ గౌరీనాథ్- సీనియర్ వైస్ ప్రెసిడెంట్- సేల్స్- గతి లిమిటెడ్ మాట్లాడుతూ, "పండుగ డిమాండ్ పెరుగుదల మరియు ఆర్డర్ వాల్యూమ్‌లో పెరుగుదలకు అనుగుణంగా మా మెరుగైన డెలివరీ సామర్థ్యాలతో మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఈ సంవత్సరం పండుగ డిమాండ్‌లో 18-20 శాతం పెరుగుదల ఉంటుందని మేము ఆసిస్తున్నాము. పండుగ వాల్యూమ్-ఆధారిత ఇ-కామర్స్ లాజిస్టిక్స్ ఫుల్ ఫిల్మెంట్ కోసం మా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 20-25% పెంచాము. తద్వారా పీక్ సీజన్ లోడ్‌ అవసరాలు తీర్చటం తో పాటుగా అత్యుత్తమ డెలివరీ సామర్థ్యాన్ని పెంపొందించగలము. Allcargo గ్రూప్ యొక్క బలాలతో , GESCPL విభిన్న లాజిస్టిక్స్ అవసరాలు మరియు 180 దేశాలలో పనిచేస్తున్న గ్లోబల్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ కోసం సమీకృత లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది" అని అన్నారు.