1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold and Silver prices

Gold and Silver prices: బంగారం ధరలు రూ.1.60 లక్షల మార్కును తాకే ఛాన్స్

gold
బంగారం ధరలు రానున్న రోజుల్లో 10 గ్రాములకు రూ.1.60 లక్షల మార్కును సులువుగా తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, రాజకీయ అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 21, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికన్ డాలర్ బలహీనత, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ధరలు పెరిగాయి. భారత మార్కెట్‌లో బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 
 
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఆంధ్రప్రదేశ్‌లో రూ.880 పెరిగి రూ.1,56,490 నుంచి రూ.1,57,370కి చేరింది. 22 క్యారట్ల బంగారం రూ.800 పెరిగి రూ.1,43,450 నుంచి రూ.1,44,250కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,17,370 నుంచి రూ.1,18,030కి చేరింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ISRO: విద్యార్థుల కోసం ఇస్రోలో వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు.. దరఖాస్తులకు ఆహ్వానం