1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:32 IST)

పతనమవుతున్న బంగారం ధరలు.. వెండి ధర పైకి

గత రెండు రోజులలో పసిడి ధరలో పెరుగుదల కనిపించగా బుధవారం మళ్లీ పడిపోయింది. బుధవారం దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి, 32,750కి పడిపోయింది. జ్యూవెలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ ఎక్కువగా లేకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం బుధవారం కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరిగి, రూ. 38,420కి చేరుకుంది. సార్వజనీన మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గి 1,298.15 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరిగి 15.13 డాలర్లకు చేరింది. 
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ.32,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి, రూ.32,580కు క్షీణించింది. వెండి కేజీ ధర రూ.20 పెరిగి, రూ.38,420కు చేరుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31,520గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,020గా కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.40,300గా కొనసాగుతోంది.