మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Modified: శుక్రవారం, 29 మే 2020 (18:11 IST)

బంగారమా... ఇక కొనగలమా?

కరోనా వైరస్ విజృంభిస్తున్నా బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈరోజు బంగారం ధరలు కాస్తంత పెరిగాయి. గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు హాంకాంగ్ విషయంలో అమెరికా మరియు చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, కరోనా వైరస్ పెరగడం వంటి వివిధ కారణాల వల్ల పైపైకి ఎగబాకాయి.
 
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫీచర్స్‌లో 10 గ్రాములకు 0.33 శాతం అంటే రూ.152 పెరిగి రూ.46,557 పలికింది. అలాగే వెండి కిలో 0.34 శాతం అంటే రూ.167 పెరిగి రూ.48,725 పలికింది. బంగారం ధర ఈ నెల ప్రారంభంలో రూ.45,556 పలికింది. ఆ తర్వాత 15వ తేదీన రూ.47,360కి పెరిగి, ఆ తర్వాత నుండి కాస్త తగ్గుముఖం పట్టింది.
 
ఈ రోజు రూ.46,550 కంటే పైకి చేరుకుంది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే సామాన్యులకు గుండె ఆగినంత పని అవుతోంది. ఏ వేడుకలకు హాజరు కావాలన్నా బంగారం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. పెళ్లిలో అయితే బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలాంటి బంగారం ధర పైపైకి ఎగబాకి, సామాన్యులకు మరింత దూరమవుతోంది. 
 
ప్రస్తుతానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.48,500గా ఉంది.