బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (09:00 IST)

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల సంగతికి వెళ్తే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఇవాళ మాత్రం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై 20 రూపాయల మేర తగ్గుదల నమోదైంది.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 650 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 9 వందలుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుంది. 
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760  రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది.